కరోనా వ్యాక్సిన్ మీద ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజనికా గుడ్ న్యూస్

-

కరోనా వ్యాక్సిన్ మీద ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజనికా గుడ్ న్యూస్ అందించింది. 95 శాతం ఆస్ట్రోజనికా  వ్యాక్సిన్ పని చేస్తుందని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజనికా ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్త కరోనా వేరియంట్ మీద కూడా ఈ వ్యాక్సిన్ పని చేస్తోందని ఆక్స్ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ డేటా ఇంకా బహిర్గతపరచవలసిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలానే తమ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితమని బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్క‌ల్ సోరియోట్ ప్రకటించారు.

వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచే ఆ విన్నింగ్ ఫార్ములాను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సాధించాయ‌ని తెలిపారు. ఇక ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా – సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తయారు చేస్తున్న కొవిషీల్డ్ ను త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని అంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకాకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన వెంటనే.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్సమావేశమవుతుందని, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత డేటాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news