ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది కూటమి ప్రభుత్వం. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలియజేశారు. 1,711 జూనియర్ లైన్ మెన్, 800 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండడంతో ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు.

దీంతో సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. దీంతో ఏపీలోని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో ఏపీ వాసులు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలోనే విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల భర్తీ కానుంది.