కారు కొనివ్వలేదని పెళ్ళిలో హ్యాండిచ్చిన వరుడు

-

వరకట్నం నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా, ఆడ పెళ్లి వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.పెళ్లిలో తమకు ఇవ్వాల్సిన కట్నం తక్కువ అయిందనో, లాంఛనాలు సరిగ్గా లేవనో కొందరు వధువులకు షాక్ ఇస్తున్నారు.తాజాగా ఓ వరుడు ఇలాంటి పనే చేసాడు.యూపీలోని లఖింపూర్ ఖేరి లోని మొగల్గంజ్ కొట్వాలి ప్రాంతానికి చెందిన చురాయి పూర్వ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె మధుబాల వివాహ ఏర్పాట్లు చేశారు.గోలా మహమ్మది నివాసి పంకజ్ కుమార్ తో పెళ్లి నిశ్చయించారు.

ఇటీవల వివాహానికి తేదీ నిర్ణయించి, బంధువులందరికీ వేడుకకు పిలిచారు.అయితే పెళ్లి రోజు వరుడు పంకజ్ అతని తరపు వారి నుంచి కొత్త డిమాండ్లు వచ్చాయి.పెళ్లిరోజు ఊరేగింపునకు రావడం అక్కడ ఆనవాయితీ.ఊరేగింపు నాటికి ఆల్టో కారు, ట్రాక్టర్, రూ.మూడు లక్షల నగదును అడిగారు.పెళ్లిరోజుు హఠాత్తుగా అడిగితే తాను ఎక్కడినుంచి తీసుకురాగలనని వధువు తండ్రి అనిల్ లబోదిబో మన్నాడు.పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే అవన్నీ అందజేస్తానని అందరి సమక్షంలో హామీ ఇచ్చాడు.ఈ క్రమంలో పెళ్లిరోజు వరుడు అతడి బంధువులు ఊరేగింపుగా రావాల్సి ఉంది.

తరచు వారికి ఫోన్ చేస్తుంటే ఊరేగింపుగా వస్తున్నట్లు బదులిచ్చారు.రాత్రి వరకు చూసిన వరుడు రాలేదు.ఈ వేడుకకు ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు.పెళ్లి ఆగిపోతే తాము ఎలా తట్టుకోవాలి అని రోదించారు.మరోవైపు పెళ్లి ఆగిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని మధువు మధు బాల చెప్పింది.దీంతో వరుడు తీరును అంతా విమర్శిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version