బ్రదర్ ప్రశాంత్‌కు శుభాకాంక్షలు..KGF2 టీమ్‌పై రామ్ చరణ్, ప్రభాస్ ప్రశంసల వర్షం

-

KGF2 టీమ్‌పై సినీ ప్రముఖుల ప్రశంసల వర్షం కురిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పిక్చర్ చూసిన వివిధ ఇండస్ట్రీల ప్రముఖులు సినిమా‌ను తీసిన దర్శకుడిని కొనియాడుతున్నారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్తు్న్నారు. తాజాగా ఈ పిక్చర్ చూసిన పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ KGF2 టీమ్ ను అభినందించారు.

యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కాగా, సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. చాప్టర్ 1 ను మించిన రెస్పాన్స్ KGF చాప్టర్ 2కు వస్తుండటం పట్ల మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ KGF2 గురించి తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టాడు. బ్రదర్ ప్రశాంత్ నీల్, డియర్ బ్రదర్ యశ్ అని మెన్షన్ చేసిన RRR హీరో..మొత్తం KGF2 టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇన్ స్టా గ్రామ్ వేదికగా KGF2 టీమ్ ను అభినందించారు. సినిమా ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. KGF2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతిహాసన్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version