వాటే స్కీమ్.. రూ.7 పొదుపు చేస్తే ఐదు వేలు పొందొచ్చు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వాటి వలన చాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే కేంద్రం అందిస్తున్న వాటిలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. దీని వలన ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. అసంఘటిత రంగంలోని వారి కోసం దీనిని తీసుకు వచ్చారు.

డబ్బులు

ఇక ఈ పధకం గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. ఈ పథకం లో చేరిన వారు నెలకు రూ.1000 నుంచి రూ.5 వేలు పొందొచ్చు.

మీరు ఈ ఏకన్త ఓపెన్ చెయ్యాలంటే ఆధార్‌ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. స్టేట్ బ్యాంక్ తో సహా అన్ని బ్యాంకుల్లో కూడా ఈ అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను ఓపెన్ చేసుకో వచ్చు.

ఈ స్కీమ్ కింద నెలకు రూ.210 చెల్లిస్తే రూ.5 వేలు వస్తాయి. అంటే మీరు రోజుకు రూ.7 ఆదా చేస్తే సరిపోతుంది. అదే రూ.1000 కావాలంటే నెలకు రూ.42 కడితే సరిపోతుంది. ఇది ఇలా ఉంటే
రూ.2000 వేల పెన్షన్ కోసం రూ.84 చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 వేల కోసం రూ.126 కట్టాలి. రూ.4 వేల పెన్షన్ కోసం రూ.168 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి గమనించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version