సీఎం జగన్ కు ఒళ్ళు మదమెక్కింది – అచ్చెన్నాయుడు

-

సీఎం జగన్ కు ఒళ్ళు మదమెక్కిందని ఫైర్‌ అయ్యారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఒళ్ళు మదమెక్కి చంద్రబాబును.. జగన్ అవహేళన చేస్తున్నాడని విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబుతో జగన్ దేంట్లోనైనా పోటీ పడగలడా? అని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడీ పరిస్థితులు నెలకొనడం ప్రజల దురదృష్టమన్నారు. ఓ దుర్మార్గుడు చేతిలో రాష్ట్రం పడి సర్వనాశనం అయిందనే బాధ ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు.. దానికి అందరూ సహకరించాలని కోరారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాలి… నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేదని నిలదీశారు. కానీ ఎన్నికల ఏడాదిలో పోర్టు, ఎయిర్ పోర్ట్ కడతానని నమ్మిస్తున్నాడు….అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లోనే వైసిపి ప్రభుత్వం మొదటి స్ధానంలో నిలబడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version