ఒంటరి అంటున్న జగన్… ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలి – అచ్చెన్నాయుడు

-

ఒంటరి అంటున్న జగన్… ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలని చురకలు అంటించారు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ ఒంటరి కామెంట్లపై అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఒంటరిగా ఉండడానికి.. వెలివేయడానికి చాలా తేడా ఉందని..సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.తల్లిదండ్రుల్ని చంపేసి, జడ్జి ముందు నాకెవరూ లేరు, నాపై జాలి చూపమన్నట్లుంది జగన్ వైఖరి అని..తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్ అనడం హాస్యాస్పదమన్నారు.

పాపాలు, దారుణాలు, భారాలు భరించలేక అందరూ దూరం పెడితే సింగిల్ గా మిగిలావని..ఒంటరితనం భరించలేక ఫ్రష్టేషనుతో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఆగ్రహించారు. ఒంటరి అంటూ దేబిరించే బదులు వెళ్లి ఒంటరి పురుష పెన్షన్ అప్లై చేసుకోవాలని..సినిమా డైలాగులు విని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చెత్త పాలన, చేవచచ్చిన ప్రసంగాల వినలేక ప్రజలు పారిపోతున్నారని..పోలీసులు, అధికారులు లేకపోతే సభల్లో ఉండేది జగన్ ఒక్కరేనని వెల్లడించారు.
వైసీపీ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చేసి జగన్ను ఒంటరిని చేశారని…త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒంటరి చేయబోతున్నారని తెలుసుకోవాలని చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version