ఒక్క ఇంజెక్షన్ తో ఆ నొప్పి మాయం…!

-

ఆస్టియో ఆర్థరైటిస్‌; వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య చాలా మందిలో ఎదురు అవుతూ ఉంటుంది. మోకాళ్లలో ఉండే కీళ్లకు, కార్టిలేజ్‌కు మధ్యన ఉండే సహజమైన పొర దెబ్బతినడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి ఈ నొప్పి క్రమంగా తీవ్రమవుతూ ఉంటుంది. ఈ నొప్పి వంశపారంపర్యంగా వచ్చే అవకాశమూ ఉందని వైద్యులు చెప్తున్నారు. అదే విధంగా గాయాల కారణంగా కూడా ఇది వస్తుంది.

అంతే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. చాలా మంది దీని కోసం శస్త్ర చికిత్సకు వెళ్తారు. అది అవసరం లేదని అంటున్నారు నిపుణులు. ఈ విధానాన్నే ‘జెనిక్యులేట్‌ ఆర్టరీ ఎంబాలిజేషన్‌’ అని పిలుస్తారు. కేవలం ఒక్క ఇంజెక్షన్‌తో అతి చిన్న పదార్థాలను మోకాళ్లలో ఉండే రక్తనాళాల్లోకి ఎక్కిస్తారు విధులు.

ఈ ప్రక్రియ మొత్తానికి 45 నుంచి 90 నిమిషాల మాత్రమే సమయం పడుతుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అంటున్నారు వైద్యులు. దీని ద్వారా ఇప్పటివరకూ 13 మంది వ్యక్తుల్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్‌ నొప్పి తీవ్రత తగ్గిందని వైద్యులు సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. అంతే కాకుండా ఈ విధానం వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవని కొత్త సమస్యలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version