కేఎల్ రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందించిన అతియా శెట్టి

-

బాలీవుడ్ నటి అతియా శెట్టి, తన బాయ్ ఫ్రెండ్, ప్రముఖ క్రికెటర్ లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను త్వరలోనే పెళ్లాడనుందంటూ వచ్చిన వార్తలపై స్పందించింది.” నేను ఎవరితోనూ కలిసి తిరగడం లేదు.. నా తల్లిదండ్రులు నా కుటుంబంతో కలసి కొత్త ఇంట్లోనే ఉండబోతున్నాము” అంటూ చెప్పింది. దక్షిణ ముంబై ఆల్టమౌంట్ రోడ్డులో అతియా శెట్టి తన కుటుంబంతో కలసి ఉంటుంది. కే ఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకోబోతున్న వార్తలను మీడియా ప్రతినిధులు ఆమె వద్ద ప్రస్తావించారు.

” నేను ఈ ప్రశ్నలకు బదులు ఇవ్వను. వీటితో అలసిపోయాను. వీటిని విని నవ్వుకోవడమే చేయగలను. ప్రజలు వారికి నచ్చినట్లు ఆలోచించుకోనివ్వండి.” అని అతియా శెట్టి బదులిచ్చింది. అతియా శెట్టి పెళ్లి వార్తలను ఆమె సోదరుడు సైతం ఇటీవల ఖండించారు. అటువంటి వేడుక లేదని, వినిపించేవన్ని వదంతులేనని అహన్ తెలిపాడు. నిశ్చితార్థం కూడా జరగని విషయాన్ని గుర్తు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version