అట్లీ  నెక్స్ ట్ మూవీ నంద‌మూరి హీరోతోనా…?

-

ఒలంపిక్స్ నేప‌థ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా కనిపిస్తున్నారు. కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో విజిల్ వేయిస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార నటించగా.. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూర్చారు.

తమిళ్‌తో పాటు తెలుగులోనూ విజయ్‌కి మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుద‌ల‌ చేశారు. ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తున్నారు.

మొదటి చిత్రం రాజా రాణి తో ఓ విభిన్నమైన ప్రేమకథను తెరకెక్కించి అందరినీ ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తలపతి విజయ్ తో తేరి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ విజయం తరువాత విజయ్ అట్లీతో మరో మూవీ మెర్సల్ చేయగా ఆ చిత్రం కూడా బంపర్ హిట్ సాధించింది. అదిరింది పేరుతో తెలుగులో విడువులైన ఈ చిత్రం మొదటిసారి విజయ్ కి తెలుగులో కూడా హిట్ అందించింది. ఈ హిట్ కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ బిగిల్ ఇంకా రెండు రోజులలో దీపావళి కానుకగా విడుదల కానుంది.

ఐతే ఈ టాలెంటెడ్ దర్శకుడు ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన విజిల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అట్లీ ఈ చిత్రంపై హింట్ ఇచ్చారు. ఆయన త్వరలోనే ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం కలదని చెప్పారు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటుంది అనే విషయం స్పష్టం ఐయ్యింది. స్టార్ హీరోలను ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చూపించడంలో దిట్టైన అట్లీ ఇక మాస్ కా బాప్ ఎన్టీఆర్ ని ఏరేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version