ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను గుర్తుతెలియని దుండగుడు తగులబెట్టాడు. ఈ ఘటన విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
దుండుగుడు నిప్పంటించడంతో పార్కింగ్ చేసిన ఐదు బైకులు దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నెల రోజులుగా పలు వాహనాలకు నిప్పు పెడుతూ దుండగుడు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టిన దుండగుడు…
👉 విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో ఘటన
👉పార్కింగ్ చేసిన 5 బైక్ లను తగులబెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు
👉 నెల రోజులుగా పలు వాహనాలకు నిప్పు పెడుతున్న దుండగుడు
👉 సీసీ… pic.twitter.com/ZzvkqIdlfP— ChotaNews App (@ChotaNewsApp) January 3, 2025