సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు, లారీ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.
నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా…..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, కారు, లారీ ఢీ..
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు pic.twitter.com/t5iGhMVysr
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025