మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. శివపురిలో శనివారం ఒక యజమాని దారుణానికి ఒడిగట్టాడు. తన వద్ద పని చేసే ఉద్యోగి ప్రాణం తీసాడు. 45 రోజుల క్రితం గోబర్ధన్ లో ఈ సంఘటన జరిగిందని శివపురి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజేష్ సింగ్ చందేల్ మీడియాకు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం తమ దృష్టికి వచ్చింది అని ఆయన చెప్పారు. అయితే ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా తమ వద్దకు రాలేదని పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేయాలని స్థానిక పోలీస్ అధికారిని తాను ఆదేశించినట్టు ఆయన వివరించారు. నవంబర్ 8 న ఈ సంఘటన జరిగిందని మృతుడి సోదరుడు ధనిరామ్ ధాకద్ మీడియాకు వివరించారు. నా సోదరుడు ఉదయం పనికి వెళ్ళాడు, మధ్యాహ్నం ఎవరో నాకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ నొప్పి ఉందని చెప్పారు అని ఘటన జరిగిన రోజు సంఘటనను మీడియాకు వివరించాడు.
నేను అతనిని కలిసినప్పుడు అది గ్యాస్ట్రిక్ నొప్పి కాదని నాకు చెప్పాడు అని… అతని యజమాని, కొంతమంది సహచరులతో కలిసి గాలిని పంప్ చేశాడు అని చెప్పాడు. కంప్రెషర్ తో అతని పురీషనాళంలోకి గాలిని పంపినట్టు వెల్లడించారు. అతని చాలా ఆస్పత్రులకు తీసుకువెళ్లినట్టు వివరించాడు. కాని అతను శనివారం రోజు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.