ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద దారుణం.. న్యాయవాది కళ్యాణ్‌కి కత్తిపోట్లు!

-

హైదరాబాద్ మహానగరంలో దొంగలు, రౌడీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అకారణంగా సామాన్యులపై దాడులకు పాల్పడుతూ దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కి వచ్చిన అడ్వకేట్ కళ్యాణ్‌పై కత్తితో దాడి జరిగింది. ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి ఇద్దరు మొబైల్ స్నాచర్స్ వెంబడించినట్లు సమాచారం.

 

ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్దకు రాగానే స్కూటీ పై వచ్చిన స్నాచర్స్.. ఆయన్ను మాటల్లో పెట్టి కావాలని గొడవకు దిగారు.అంతలోపే స్కూటీపై వెనక కూర్చున్న వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. కళ్యాణ్ ఎడమ చేతిలో ఫోన్ ఉండటంతో దానిపై కత్తితో దాడి చేశాడు.మొబైల్ కింద పడగానే తీసుకుని దుండగులు పరారయ్యారు.కళ్యాణ్ చేతికి స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఖైరతాబాద్ పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version