గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి విషం ఇచ్చి తల్లి కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పీఎస్ పరిధి ప్రగతినగర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. నాలుగేళ్ల చిన్నారి, తల్లి ఇంట్లో అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితులిద్దరిని ఆసుపత్రి తరలించారు.విషం తిన్న కూతురు అప్పటికే మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, తల్లి, నాలుగేళ్ల చిన్నారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. నాలుగేళ్ల కూతురికి విషం ఇచ్చి, ఆపై తానూ ఆత్మహత్యాయత్నం..!
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఘటన
18వ తేదీ సాయంత్రం చోటు చేసుకున్న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..
కూతురు జశ్వికకి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపిన తల్లి క్రిష్ణపావని
అనంతరం… pic.twitter.com/RshZKNbKVY
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2025