ఓల్డ్ సిటీలో దారుణం.. వ్యక్తి ప్రాణం తీసిన కుర్చీల వివాదం

-

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. షాపు ముందు కుర్చీలు ఎందుకు వేశారని యజమాని ప్రశ్నించడంతో అది కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది. చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారడంతో సదరు వ్యక్తిపై పక్క షాపు వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది.

వివరాల్లోకివెళితే.. పాతబస్తీలోని హఫీజ్‌బాబా నగర్‌ సీ-బ్లాక్‌లో జకీర్ ఖాన్(62) కిరాణా దుకాణం నడుపుతున్నారు. జకీర్ షాపు ముందు ఆ పక్కనే ఉన్న పాన్‌షాపు యజమాని కుర్చీలు వేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జకీర్‌పై పాన్‌షాపు యజమానులు దాడికి పాల్పడ్డారు. దీంతో జకీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news