విజయసాయి రెడ్డి నిన్న చేసిన కోటరీ వ్యాఖ్యలకు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాధ్ చురకలంటించారు. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ
ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? అని ప్రశ్నించారు.
మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోట గురించి మాట్లాడితే ఏమి బాగుంటుందని పేర్కొన్నారు. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం? అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలున్నాయి. ఒకటి కూటమి వర్గం.. ఒకటి వైసీపీ వర్గం.. మరొకటి ఏ వర్గం అధికారంలో ఉంటే.. ఆ పార్టీ వైపు చూసే రకం అన్నారు.