సికింద్రాబాద్ లో దారుణం.. చేతబడి చేస్తోందని చంపేశారు

-

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు ఇంకా తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి. చేతబడి చేయడం, మంత్రాలు వేయడం వంటి మూఢనమ్మకాలు ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. మంత్రాలు చేస్తోందన్న ఆరోపణలతో దాడులకు పాల్పడిన ఘటనలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పటికీ ప్రజలు మూఢనమ్మకాలతో సహజీవనం చేస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

చేతబడి చేస్తుందని ఓ మహిళను కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మహిళను గొంతు నిలిమి హత్య చేసి.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మహిళది హత్యగా పోలీసులు గుర్తించారు. మహిళ కుటుంబ సభ్యులను చిలకలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version