మీ పాన్ కార్డు పోయిందా..? కొత్త పాన్ కార్డుని ఇలా పొందండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కూడా ఒకటి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ ఆర్థిక లావాదేవీకి అవసరం. అలానే బ్యాంకింగ్‌ మొదలైన వాటి కోసం కూడా పాన్ కార్డు ఉండాలి. అయితే ఒక్కోసారి మన పొరపాటు వలన ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ కనుక మీ పాన్ కార్డు మిస్ ఆయితే ఇలా చెయ్యండి.

పాన్ కార్డు పోతే కంగారు పడద్దు. ఇలా ఈజీగా కొత్త పాన్‌ కార్డును తీసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. NSDL e-Gov ద్వారా ఇటీవల PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన వాళ్ళు లేదంటే ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN ఫెసిలిటీ తో PAN పొందిన కార్డ్ హోల్డర్‌లు ఈ విధంగా రీ ప్రింట్ ని పొందడానికి అవుతుంది.

అయితే మీరు దీని కోసం మొదట https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html లింక్ లోకి వెళ్ళాలి. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు పెర్మిషన్ ఇవ్వాల్సి వుంది. అలానే అక్కడ వచ్చే క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. అయితే పాన్ కార్డ్ రీప్రింట్ ని మీ ఇంటికి పంపేందుకు పే చెయ్యాలి.

ఫారం నింపిన తర్వాత ఆన్‌లైన్‌లో దీన్ని పే చెయ్యాలి. భారతదేశంలో కార్డును డెలివరీ చేయడానికి రూ.50 కట్టాల్సి వుంది. రీప్రింట్ చేసిన పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిరునామాకు పంపిస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version