తిరుపతిలో దారుణం..జనాలపైకి దూసుకెళ్లిన అంబులెన్స్, ఇద్దరు మృతి

-

ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల కథనం ప్రకారం..జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలోని రంగంపేట నుంచి సోమవారం తెల్లవారు జామున భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చినఅంబులెన్స్ అదుపుతప్పి భక్తులపై నుంచి దూసుకెళ్లింది.

Tragedy in New Year celebrations

ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, పొగమంచుకారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version