వింత కారణంతో అమెజాన్ గోదాంపై దాడి.. పోలీసులు షాక్.!?

-

భారతదేశం భిన్న మతాలకి భిన్న సంస్కృతులకు నిలయంవంటిది. అలాగే దేశంలో చాలా రకాల భాషలు మాట్లాడుతుంటారు. కానీ దేశ భాష మాత్రం హిందీనే. ఇక దేశంలో ఎక్కువగా వాడే భాష ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్ వస్తే దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. ఇక ఈ రెండు భాషలే కాక తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ మొదలగు భాషలు కూడా ఉన్నాయి. ఇక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడుతుంటారు. అలాగే ఇక ప్రాంతీయ బాష పై స్థానికులకు కొంచెం మక్కువ ఎక్కువే. అందుకే ఎక్కువగా ప్రాంతీయ బాషలోనే మాట్లాడుతుంటారు. అలాగే పలు ఆఫీసుల్లో బోర్డ్స్ కౌటౌట్స్ కూడా ప్రాంతీయ భాషల్లోనే ఉండాలంటారు.

మరాఠీలో షాపింగ్ యాప్‌ను వెబ్ కామర్స్ కంపెనీ అందించడంలో విఫలమైందనే అయితే ఎన్ని ఆదేశాలు జారీచేసిన కూడా ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ తన పద్దతి మార్చుకోలేదని అమెజాన్ పోస్టర్లు వెబ్ సైట్ నావిగేషన్ వ్యవస్థ కి మరాఠీ భాష లేదంటూ ముంబై పూణేలలోని అమెజాన్ గోదాములపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు దాడి చేశారు. . గతంలో MNS అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పై పరువు నాశం దావా కేసులో అమెజాన్ కోర్టుకు వెళ్ళింది. మహారాష్ట్రలో తమ బిజినెస్ విషయంలో ఆ పార్టీ జోక్యం చేసుకోవడం పై లీగల్ గా అమెజాన్ చర్యలు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళింది. మెజాన్ చేసిన ఆరోపణలపై జనవరి 13 లోగా అఫిడవిట్‌కు సమాధానం ఇవ్వాలని ఎంఎన్‌ఎస్‌ను కోర్టు ఆదేశించింది. జనవరి 5 న రాజ్ కోర్టుకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే ఈ కేసు గురించి రాజ్ ఠాక్రే ను కోర్టుకు హాజరు కావాలని ముంబై కోర్టు కోరడంతో , ఎంఎస్ఎన్ కార్యకర్తలు కార్మికులు అమెజాన్ పై దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికులు పూణేలోని ఒక అమెజాన్ కార్యాలయాన్ని, ముంబైలోని ఒక వేర్ హౌస్ మరియు శివారులోని చండివాలిలోని మరొక సెంటర్ ను టార్గెట్ చేసుకొని దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడి లో పలు టీవీలు లాప్ ట్యాప్స్ ధ్వంసం అయ్యాయి.

మరాఠీ భాషకు ఇతర భాషల మాదిరిగానే అమెజాన్‌లో స్థానం ఉండాలని ఎంఎన్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ కారణంగా, ముంబైలో ప్రతిచోటా ‘నో మరాఠీ, నో అమెజాన్’ సంకేతాలను ఉంచడం ద్వారా ఎంఎన్ఎస్ తీవ్రమైన ప్రచారాన్ని ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version