ప్రాణాలమీదికి తెచ్చిన విహార యాత్ర …!?

-

ములుగు జిల్లా విహారయాత్ర ప్రాణాల మీదకు తెచ్చింది. వరుస సెలవులు రావడంతో సరదా గడిపేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరువులో గల్లంతయ్యాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ప్రమాదవశాత్తు లక్నవరం జలాశయంలో జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధాకర్‌ గల్లంతయ్యాడు.

crime

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సుధాకర్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. క్రిస్మస్, వీకెండ్ కలసి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. దీంతో దాదాపు 18 మంది యువతి, యుకులు శుక్రవారం లక్నవరం చెరువును సందర్శించేందుకు వచ్చారు. అందులో సుధాకర్ కూడా ఉన్నాడు.సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడిపోయాడు. స్నేహితులు గమనించేలోపే సుధాకర్ నీటిలో మునిగిపోయాడు. దీంతో షాక్‌కు గురైన మిత్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.నిన్నసాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుందిఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ బృందంలో కొందరు చెరువుపై ఉన్న ఉయ్యాల వంతెన పై నుంచి రెస్టారెంట్‌కు వెళ్లారు. సాయంత్రం సుధాకర్ చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండాగా ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయారు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న స్నేహితులు కూడా ఏం చేయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version