పాల విషయంలో గొడవ.. వదిన ముక్కు కోసాడు…!

-

కొంత మంది మద్యానికి బానసైతే ఏం చేస్తారో కూడా అర్ధం ఉండదు… పీకల వరకు తాగి వచ్చి ఇంట్లో వాళ్ళను గాయపరచడం, ఇబ్బందులు పెట్టడం, పక్కింటి వాళ్ళ మీద గొడవలకు వెళ్ళడం వంటివి చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా సరే వినకుండా మద్యం మత్తులో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంత మంది అత్యాచారాలు చేయడం పక్కని వాళ్ళని గాయపరచడం, మరికొన్ని సార్లు వాళ్ళను వాళ్ళే ఇబ్బంది పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. మద్యం మత్తులో ఉన్న వాళ్ళు జీవితాలు నాశనం చేసిన ఘటనలు కూడా చూస్తున్నాం.

ఈ సమయంలో చిన్న గొడవ అయినా సరే దాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఎదుటి వారు ఏం చెప్తున్నారో కూడా వినే ప్రయత్నం చేయరు కొందరు ప్రభుద్దులు. తాజాగా పాల విషయంలో తలెత్తిన చిన్న గొడవ ముక్కు కోసే వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో పీకల వరకు మందు తాగి వచ్చాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిస అయిన అతడు… ప్రతీ రోజు ఇదే విధంగా మందు తాగి వచ్చి, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు…

ఈ క్రమంలోనే మంగళవారం ఫుల్లు గా తాగి ఇంటికి వచ్చాడు. పాల విషయంలో అతని వదినతో ఒక గొడవ జరిగింది. ఇక ఫుల్లు గా తాగి ఉన్న అతగాడు… కోపం గా కత్తి తీసుకుని వెళ్లి అతని వదిన ముక్కు కోసేసాడు. ఈ ఘటనలో ఆమె ముక్కుకి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించి హత్యాయత్నం కింద కేసు నమోదు చేసారు. అయితే ఘటనకు అదేనా కారణం ఇంకేది అయినా ఉందా అనే దాని మీద విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version