బిడ్డల కోసం తన జీవితాన్ని అర్పించి చివరి క్షణాల్లో వారి నుంచి ప్రేమాభిమానాలు కోరుకుంటున్న నేటితరం పేరెంట్స్‌కు కన్నీళ్లే మిగులుతున్నాయి. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొందరు తనయుడు క్రూరమృగాళ్లుగా మారి కన్నపేగును తెంచుకున్నట్లు వారిని కూడా తెంచుకోవాలని చూస్తున్నారు.
ఇలాంటి ఘటనే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కొడుకు.. వృద్ధురాలని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు.ఆమె గొంతు నులిమి చంపేయబోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆమె కూతురు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇలాంటి కొడుకుల కన్నా కుక్క మేలు
పంజాబ్ లూథియానా జిల్లాలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఓ కొడుకు వృద్ధురాలని చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గొంతు నులిమి చంపేయబోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆమె కూతురు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు… pic.twitter.com/7888Dd8Puc
— ChotaNews App (@ChotaNewsApp) April 4, 2025