మద్యం మత్తులో ఓ కొడుకు కన్నతల్లిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యానికి బానిసైన కొడుకు తాగేందుకు డబ్బులివ్వలేదని తల్లిని హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం.. గుర్రాలదండి కొత్తతండాకు చెందిన మోజి, రాములు దంపతులకు కుమారుడు శ్రీను ఉన్నాడు. అతనికి వివాహమైంది. భార్యతో కలిసి చేవెళ్లలో నివాసముంటున్నాడు. ఏప్రిల్ 4న ఇంట్లో భార్యతో గొడవపడి తల్లి దగ్గరకు వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో తల్లి మోజి తలపై శ్రీను కర్రతో బలంగా కొట్టాడు.దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.