టీడీపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఈఎస్ఐ స్కాం లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఉదయం 6 గంటల తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన హయాంలోనే ఈ స్కాం జరిగింది అని అధికారులు గుర్తించారు. కొనుగోళ్ళకు సంబంధించి ఆయన కుమారుడి పాత్ర కూడా ఉంది అని అధికారులు గుర్తించారు.
నకిలీ కొటేషన్ లతో మందులను కొనుగోలు చేసినట్టు వెల్లడి అయింది. ఆయనను ఏసీబీ పోలీసులు 100 మంది తో విశాఖకు తరలించి అక్కడి నుంచి విజయవాడ తరలిస్తారు మందులు, పరికరాలు విషయంలో ఆయన అవినీతి చేసినట్టు గుర్తించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ మందుల గోల్ మాల్ జరిగింది అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఇక ఈ కేసుకి సంబంధించి ఆయన కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. 988 కోట్ల అవినీతిలో ఆయనది 150 కోట్ల వరకు పాత్ర ఉంది అని అధికారులు గుర్తించారు. ఆయనతో పాటుగా మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఉంది అని అధికారులు గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గానూ వంద మంది ఏసీబీ అధికారులు వెళ్ళారు అని సమాచారం.