ప్రభుత్వ వైఫల్యాన్ని క్లౌడ్ బరస్ట్ కుట్రగా మార్చేందుకు ప్రయత్నం: కోదండరామ్

-

క్లౌడ్ బరస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పలువురు రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరామ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. భారీ వర్షాలకు విదేశీ కుట్ర కారణమని సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం అవివేకమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు క్లౌడ్ బరస్ట్ కుట్రగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. క్లోడ్ సీడింగ్ ప్రక్రియకు శాస్త్రీయత లేదన్నారు. ముందుచూపుతో వ్యవహరించి నదీ నీటి నిర్వహణను ప్లాన్ చేయాలని సూచించారు. బ్యాక్ వాటర్‌తో ఎక్కువ ప్రాంతాలు మునిగాయని చెప్పారు.

ప్రొఫెసర్ కోదండరామ్

ప్రభుత్వ వైఫల్యంతోనే కాళేశ్వరం పంపింగ్ హౌస్ మోటార్లు మునిగిపోయాయని ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ప్లాన్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రాంతాలు మునిగిపోయాయన్నారు. ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version