గతం వారం కురిసి భారీ వర్షాలకు తెలంగాణలో వరదలు సంభవించాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ విదేశీ కుట్రతోనే వర్షాలు వచ్చాయని, భారీ వర్షాలు క్లౌడ్‌్ బరస్ట్‌తోనే వచ్చిఉంటాయంటూ వ్యాఖ్యానించారు. అయితే.. సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్రలు నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమైన క్లౌడ్ బరస్ట్ లపై విదేశీ కుట్రల విషయంలో సంచలన ఆరోపణలు చసిన సీం కేసీఆర్ అందుకు సాక్ష్యాలిస్తే సీరియస్ గా విచారణ చేస్తామని కిషన్ రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు.