ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆవరణలోనే ఒక మహిళ మీద రేప్ జరిగినట్లుగా తెలుస్తోంది..ఆస్ట్రేలియా పార్లమెంట్ లోని ఓ మంత్రి ఆఫీసులో జరిగిన ఈ అత్యాచార ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.. 2019లో జరిగిన ఈ దారుణాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో బాధితురాలు తాజాగా బయట పెట్టింది.. అయితే ఈ ఘటన మీద పోరాడటానికి ఉన్నతాధికారుల నుంచి తనకు సరైన మద్దతు లభించలేదని బాధితురాలు ఇంటర్వ్యూలో పేర్కొంది.
అయితే ఈ ఘటన ఆస్ట్రేలియా వ్యాప్తంగానే కాక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో బాధితురాలికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు చెప్పారు. అంతేకాక ఈ ఘటన మీద దర్యాప్తు ఆదేశిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఆఫీసులో తన సీనియర్ అధికారి తనను రేప్ చేశాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. అంతేకాక ఈ విషయాన్ని బయట పెడితే ఉద్యోగం పోతుంది అని కూడా తనను బెదిరించాడని ఆమె ఆరోపిస్తోంది.