ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఎలర్ట్…! పలు అంశాల్లో మార్పు..!

-

ఈ బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాల్ని గమనించాలి. మీకు అలహాబాద్ బ్యాంక్‌లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే దీని కోసం మీరు తప్పక తెలుసుకోవాలి. లేదంటే మీపై ప్రభావం పడనుంది. అందుకే కొత్త అప్డేట్స్ ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మారిపోయాయి. కాస్త గమనించండి. మీరు వెంటనే కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు తెలుసుకోండి. లేకపోతే ఆన్‌లైన్ ‌లో ఇతరులకు డబ్బులు పంపడం కుదరదు.

ఇండియన్ బ్యాంక్‌ లో అలహాబాద్ బ్యాంక్ విలీనమైన సంగతి తెలిసినదే. దీంతో బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మారిపోయాయి. కనుక అందరు దీని కోసం తెలుసుకోండి. అందువల్ల వల్ల పాత కోడ్లు పని చేయవు. మీరు కనుక కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు తెలుసుకోవాలంటే మీరు ఐఎఫ్ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేసి 9266801962 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఇలా సెండ్ చేసాక మీ కొత్త కోడ్ వస్తుంది. దీనితో మీరు ఏ అడ్డంకి లేకుండా కొత్త కోడ్స్ ని తెలుసుకోవచ్చు.

అలానే మరి కొన్ని కూడా మారనున్నాయి. అవి ఏమిటంటే..? బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎంపవర్ ఇప్పుడు IndOASIS అయ్యింది. అలానే నెట్ బ్యాంకింగ్ సైట్ కూడా మారుతుంది. చెక్ బుక్, పాస్‌బుక్‌లు కూడా మారిపోతాయి. కాబట్టి వీటి కోసం కూడా తెలుసుకోండి. అలహాబాద్ బ్యాంక్ చెక్‌బుక్‌లు ఉన్నంత వరకు చెల్లుబాటు అవుతాయి. లేదా 6 నెలల వరకు చెల్లుతాయి. ఆ తర్వాత పని చేయవు. నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వారు ఇండియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కొత్త పాస్ బుక్‌లు కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version