IND vs AUS 2nd ODI: టాస్‌ గెలిచిన‌ ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

-

భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రసవత్తరపోరు జరగనుంది. వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే భారత్ సిరిస్ ఆశలు నిలిచే చాన్స్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ కూడా మొదటి మ్యాచ్ లాగానే ఆడేందుకు సిద్ధమవుతోంది. శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్నది. వాంఖడే వేదికగా గత మంగళవారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంద‌ని, త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేద‌ని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆర‌న్ ఫించ్ తెలిపాడు. ఒక‌వేళ మేం టాస్ గెలిచినా, ముందు బౌలింగ్ ఎంచుకునే వాళ్లమ‌ని భార‌త కెప్టెన్ కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉంటే.. వాంఖడే వన్డేలో కమిన్స్ విసిరిన బంతి హెల్మెట్‌కి బలంగా తాకడంతో పంత్‌ తల అదిరింది. దీంతో.. ఆ మ్యాచ్‌లో కీపింగ్‌కి దూరంగా ఉన్న పంత్.. ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. పంత్ స్థానంలో మనీశ్ పాండేని తుది జట్టులోకి తీసుకున్న కోహ్లీ.. శార్ధూల్ ఠాకూర్‌పై వేటు వేసి యువ పేసర్ నవదీప్ షైనీని తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version