ఆడియో టేపు విషయంపై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేసి చెప్పడంతో తాను కూడా చూశానని.. తనను ఆడియో టేప్ విషయం చాలా బాధించిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంత మంది ఆకతాయిలు ఇలా చేసారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కుట్రలు ఎవ్వరు ఎన్ని చేసినా అవి ఫలించవన్నారు. రోజు రోజుకు రాజకీయాలు ఎలా దిగజారుతున్నాయో ఇదే ఉదహరణ అని వ్యాఖ్యానించారు. తన ప్రత్యార్థి కూడా బాగుండాలని అనుకోనే వ్యక్తిని అని అవంతి అన్నారు.
పోలీసులు త్వరలోనే యాక్షన్ తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇది ప్రత్యర్థులకు తాత్కాలిక ఆనందం మాత్రమే అని చెప్పారు. అవంతి శ్రీనివాస్ ఎప్పుడూ తప్పు చెయ్యడన్నారు. ఈ మధ్య ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా..అని అందుకే కొందరికి ఈ విషయం నచ్చలేదన్నారు. అందుకే తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన పై పోటీ చేసిన వారు నాకు ఇప్పుడు తనకు మిత్రులని అవంతి వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయ్యలేదని…తన మీద ఎందుకు ఇలాంటివి కల్పిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.