2014 చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో విశాఖపట్టణానికి చెందిన అవంతి శ్రీనివాస్ మరియు గంటా శ్రీనివాస్ ఇద్దరు మంత్రులు గా వ్యవహరించడం జరిగింది. కాగా 2019 ఎన్నికల సమయములో భీమిలి అసెంబ్లీ టికెట్ కోసం అవంతి మరియు గంట మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకోవడంతో అవంతి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో భీమిలి టికెట్ వైసీపీ తరఫున అందుకుని గెలిచారు. ఇదే తరుణంలో గంటా శ్రీనివాస్ మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ అధికారంలో లేకపోవటంతో తనకు గతంలో రాజకీయంగా అనేకసార్లు అడ్డుపడటం తో ఇప్పుడు అవ్వడానికి…గంటా ఇలాకాలో చేస్తున్న హడావిడి వైసిపి పార్టీలో చర్చనీయాంశమైంది.
విషయంలోకి వెళితే గంటా శ్రీనివాసరావు…జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొన్ని ఎలక్షన్ల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించారు. దీంతో ఘంటా శ్రీనివాస్ అడ్డా లో అవంతి శ్రీనివాస్ చేస్తున్న హడావిడి చూసి జగన్ నవ్వుకుంటున్నారు అన్ని పార్టీలో టాక్.