అవతార్ 2 నుంచి కొత్త ట్రైలర్

-

 

13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ ప్రపంచ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఆ సినిమా విజువల్స్ చూసి ఆశ్చర్యపోనివారుండరు. తన విజన్ తో టేకింగ్ తో జేమ్స్ కామెరూన్ అప్పుడే ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు మళ్లీ ఆ ఫ్రాంఛైజీలో అవతార్ -2 తీస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అవతార్ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ సినిమా రెండో ట్రైలర్‌ ను రిలీజ్‌ చేయనున్నారట. కానీ ఈ ట్రైలర్‌ ముందులా యూట్యూబ్‌ కానీ ఏ సోషల్‌ మీడియాలో కానీ రిలీజ్‌ చేయడం లేదని పేర్కొంది చిత్ర బృందం. ఈ రోజు రాత్రి జరుగుతున్న ఫూట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఎక్స్‌ క్లూజివ్‌ గా ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానెల్‌ ఈఎస్‌పీఎన్‌ ద్వారా రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version