Ayesha uses inner eye to save lives, detects cancer with fingertips: బెంగళూరుకు చెందిన ఓ మహిళ కంటి చూపు లేకపోయినా తన చేతి స్పర్శతో అద్భుతాలను సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే…. ఆయేషా భాను పుట్టుకతోనే అంధురాలు. ఈమె వయస్సు 24 ఏళ్లు. బెంగళూరుకు చెందిన మహిళ. పుట్టినప్పటినుంచి అంధురాలు అయినప్పటికీ తన ఉన్నతమైన స్పర్శ భావంతో ప్రాణాలు కాపాడే సాధనంగా మలుచుకుంది.

డిగ్రీ చదివినప్పటికీ ఉద్యోగం దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడింది. దీంతో సైట్ కేర్ హాస్పిటల్స్ లో మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్ గా ఉద్యోగం పొందింది. ఆ ఉద్యోగం ద్వారా ఎంతోమంది మహిళల ప్రాణాలను కాపాడింది. మ్యాజిక్ ఫింగర్స్ అనే స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా రొమ్ము క్యాన్సర్ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది. కంటి చూపు లేకపోయినప్పటికీ మహిళల ప్రాణాలను కాపాడుతున్న అయేషాను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.