Ayodhya: అయోధ్య రామయ్యకు భారీగా కానుకలు…..

-

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది. రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం సమీపిస్తున్న వేళ శ్రీరామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు 108 అడుగుల ఆగరు బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల భారీ దీపం, 500 కిలోల కుంకుమ, బంగారు పాదుకలు, పది అడుగుల తాళం, ఏకకాలంలో 8 దేశాల సమయాన్ని సూచించే గడియారం, సీతమ్మ జన్మస్థలం నేపాల్ లోనీ జనక్ పూర్ ధామ్ నుంచి వెండి పాదరక్షలు , ఆభరణాలు, వస్త్రాలతో పాటు మూడు వేలకు పైగా బహుమతులు కాన్వాయ్, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన దాన్యం అయోధ్యకు చేరుకున్నాయి .కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ అయోధ్యకు చేరుకున్నాయి .

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డులు, శ్రీలంక ప్రతినిధి బృందం అశోక వాటిక నుంచి ప్రత్యేక కానుక , ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం నుంచి ఐదు లక్షల లడ్డూలు, మధుర లోని శ్రీకృష్ణ జన్మాస్తాన్ నుంచి 200 కిలోల లడ్డూలు, భక్తుల కోసం 7 వేల కిలోల రామ్ హల్వాను నాగపూర్ కు చెందిన చెప్ విష్ణు మనోహర్ తయారు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన 64 ఏళ్ల చల్ల శ్రీనివాస శాస్త్రి శ్రీరాముడికి బంగారు పూత పూసిన పాదరక్షలను సమర్పించడానికి 8 వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య మొత్తం రామనామంతో మార్మోగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version