షారుక్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అయోధ్య స్వామీజీ..!!

-

బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటులలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. అలాగే స్టార్ హీరోయిన్ దీపిక పడుకొని కూడా స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం పఠాన్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని ఫోటోలు, వీడియో సాంగ్స్ పైన పలువురు ప్రేక్షకులు హిందూ మతస్తులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పఠాన్ చిత్రం నుంచి విడుదలైన బేషారమ్ రంగ్ పాట పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి.

ఇందులో షారుక్ , దీపికాలు ధరించిన దుస్తులపై హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికి ఎంతోమంది వీరి దుస్తులపైన మాట్లాడడం జరిగింది. ఈ సినిమాని నిషేధించాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యకు చెందిన స్వామీజీ మహంత్ పరమహంస పఠాన్ సినిమా పైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరుగుతోంది.బేషారమ్ రంగ్ పాట పైన ప్రతి ఒక్కరు కూడా నిరసనలు చేస్తున్నారు ఈరోజు షారుక్ ఖాన్ పోస్టర్ను మాత్రమే తగలబెట్టాము.. ఒకవేళ ఆయన కానీ నాకు ఎదురైతే సజీవ దహనం చేస్తానంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకవేళ థియేటర్లో ఈ సినిమా విడుదలయితే థియేటర్ నే దగ్ధం చేస్తామని పరమ హింస హెచ్చరిస్తున్నారు. వీటితో పాటే ప్రేక్షకులు అందరూ కూడా పఠాన్ చిత్రని బాయ్ కాట్ చేయాలని స్వామీజీ కోరడం జరుగుతోంది. స్వామీజీ మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు కొంతమంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పలువురు బిజెపి నేతలు కూడా దీపిక, షారుక్ వస్త్రాల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరితోపాటు పలువురు ముఖ్యమంత్రి బిజెపి నేతలు ,హిందూ నేతలు కూడా పఠాన్ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version