Ayushmann Khurrana: ఆయుష్మాన్ ‘అనేక్’ ట్రైలర్ రిలీజ్..వెర్సటైల్ యాక్టర్‌తో జేడీ చక్రవర్తి ఫైట్

-

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం ‘అనేక్’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ ట్రైలర్ గురువారం విడుదల చేశారు మేకర్స్. ఈశాన్య రాష్ట్రాల సమస్యను డీల్ చేసే ఆర్మీ ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఖురానా ట్రైలర్ లో కనిపించారు.

యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న వేర్పాటు వాద సమస్యలను దర్శకుడు చిత్రంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Kolkata: Bollywood actor Ayushmann Khurrana during a press conference for his upcoming movie Hawaizaada in Kolkata on Jan 27, 2015. (Photo:IANS)

‘‘తప్పడ్, ఆర్టికల్ 15, ముల్క్’’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా ‘ఆర్టికల్ 15 ’ ఫిల్మ్ చేశారు. అది బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఈ చిత్రం కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

ఇక ట్రైలర్ చివరలో టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి నటించారు. హీరో ఆయుష్మాన్ ఖురానా..సార్ మీది ఎక్కడ? అని ప్రశ్నించగా, తాను తెలంగాణ అని చెప్తాడు…అప్పుడు తాను ఎక్కడ అనేది చెప్పాలనగా, నార్త్ ఇండియా అని అంటాడు. అప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది లేకుండా ‘‘ఇండియన్’’ అని మనం ఎప్పుడు చెప్పుకుంటామని ఆయుష్మాన్ ఖురానా ప్రశ్నిస్తాడు. అంతటితో ట్రైలర్ ముగస్తుంది. ఈ నెల 27న ‘అనేక్’ సినిమా విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version