వైసీపీ రాస్యసభ సీట్ల ఎంపికపై అయ్యన్న వ్యంగ్యాస్త్రాలు..

-

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఖ‌రారు చేస్తూ వైసీపీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ కోటాలోని రాజ్య‌స‌భ సీట్ల‌ను తెలంగాణకు చెందిన వ్య‌క్తుల‌కు ఎలా కేటాయిస్తార‌ని అయ్యన ప్రశ్నించారు. అంతేకాకుండా పెద్ద‌ల స‌భ‌కి వెళ్లే అర్హ‌త ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాల‌లో ఏ ఒక్క నేత‌కీ లేదా? అంటూ సీఎం జ‌గ‌న్‌పై మండిపడ్డారు. ఈ మేర‌కు ఆయ‌న కాసేప‌టి క్రితం రెండు వ‌రుస ట్వీట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన సీఎం జ‌గ‌న్ తీరును ప్ర‌శ్నిస్తూ అయ్య‌న్న ట్వీట్లు సాగాయి. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాద‌ని మీర‌నుకుంటున్నారా? అని ఆయ‌న జ‌గ‌న్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డింద‌న్న అయ్య‌న్న‌… ఏపీకి సీఎం అయిన మొద‌టి రోజునుంచే మీరు ఏపీ నిధులు, నీళ్లు, నియామ‌కాల‌న్నీ తెలంగాణ‌కి దోచిపెడుతున్నారని ఆరోపించారు. నిధులు, విధుల‌తోపాటు కూర్చోవ‌డానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేష‌న్లను ఏపీ బీసీల‌కి విదిల్చి, తెలంగాణ వాళ్లకు అత్యున్న‌త రాజ్య‌స‌భ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తుల నేత‌ల‌కి వెన్నుపోటేనంటూ అయ్య‌న్న వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version