సెప్టెంబర్ నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి ఈ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వైసిపి వాళ్ళు వస్తారో లేదో క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రారని స్పీకర్ ప్రశ్నించారు. అసెంబ్లీకి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా? సభకు వచ్చి సమస్యలు అడగాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు.

వైసిపి ప్రభుత్వంలో ఐదేళ్లలో 78 రోజులే సభను నడిపించారంటూ అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మరి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారో లేదో అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్లయితే అతనికి ఏ విధమైన గౌరవం లభిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా…. ఏపీలో జరిగిన జడ్పిటిసి ఎన్నికలలో టిడిపి పార్టీ విజయం సాధిస్తుంది. పులివెందులలో టిడిపి విజయం సాధించింది. అలాగే ఒంటిమిట్టలో కూడా టిడిపి పార్టీ విజయం సొంతం చేసుకుంది.