జాకీ అండర్వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు – అయ్యన్నపాత్రుడు

-

మాజీ మంత్రి ఘంటాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని ఆరోపించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం అన్నారు అయ్యన్నపాత్రుడు.

అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు. మాకు అందరూ కావాలని.. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం అన్నారు. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసిందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారని తెలిపారు.

సాఫ్ట్ వేర్ కంపెనీ, హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయన్నారు. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారని అన్నారు. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని మండిపడ్డారు అయ్యన్న. భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ. 20 ఎక్కువగా ఉందన్నారు. సీఎం జగన్ ముద్దుల భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version