అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు పోయాయి. ఈ తీవ్ర విషాద ఘటన ఏపీలోని అమలాపురం మండలం ద్వారకా తిరుమలలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకివెళితే..స్నేహితులతో కలిసి ద్వారకా తిరుమలకు వచ్చిన అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన సురేష్ (27) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
అనంతరం తోటి అయ్యప్పలు చూస్తుండగానే ఒక్కసారిగా సురేష్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. సురేశ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.