వివాదంలో బాబా రాందేవ్ పతంజలి బ్రాండ్

-

తాజాగా ప్రముఖ యోగా గురువైన బాబా రాందేవ్ పతంజలి బ్రాండ్ పై వివాదం నెలకొంది. అసలు విషయానికి వస్తే… బాబా రాందేవ్ పతంజలి బ్రాండ్ వివిధ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుండడం తెలిసిందే. అయితే పతంజలి పేరుపై తాజాగా వివాదం రేపింది. బాబా రాందేవ్, పతంజలి గ్రూప్ ఎండీ బాలకృష్ణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ధ్వజమెత్తారు. మహర్షి పతంజలిని యోగా విజ్ఞాన పితామహుడిగా భావిస్తారని, అటువంటి మహోన్నత వ్యక్తి పేరును వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని శరణ్ సింగ్ పేర్కొన్నారు.

బాబా రాందేవ్, బాలకృష్ణ వెంటనే వారి బ్రాండ్ కు పతంజలి పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. పతంజలి అనే పేరును ఉపయోగించుకునే హక్కు వారికెక్కడిది అని ప్రశ్నించారు. పతంజలి పేరును తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీ శరణ్ సింగ్ హెచ్చరించారు. పతంజలి బ్రాండ్ పేరుతో దేశంలో వారి వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నారని, కానీ, సబ్బులు, నెయ్యి, లో దుస్తులకు ఆ మహనీయుడి పేరు వాడుకోవడం సబబు అనిపించుకోదని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version