23 యేళ్ళ అమ్మాయిని 2వ వివాహం చేసుకున్న బబ్లూ పృథ్వీరాజ్..నిజమెంత..?

-

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బబ్లూ పృధ్విరాజ్.. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటారు. ఇక ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే 23 సంవత్సరాలు వయసు కలిగిన ఒక అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు అనే వార్త బాగా హల్చల్ చేస్తోంది.. ఇంతకు అసలు విషయం ఏమిటంటే నటుడు పృథ్వి రాజ్ తన భార్యతో విభేదాల కారణంగా గత కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రెండవ వివాహం చేసుకున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

గత కొద్ది రోజుల క్రితం మలేషియా కు చెందిన 23 సంవత్సరాల అమ్మాయితో పృధ్విరాజ్ వివాహం జరిగిందని , ఈ పెళ్లి కూడా చాలా రహస్యంగా జరిగిందని వదంతులు బాగా వినిపిస్తున్నాయి. అంతేకాదు పృధ్విరాజ్ రెండవ భార్యతోనే ఉంటున్నారనే వార్తలు తమిళ్ మీడియాలో కోడే కోస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే పృథ్వీరాజ్ నుంచి ఖచ్చితంగా కన్ఫర్మేషన్ రావాల్సిందే. 57 సంవత్సరాల పృధ్విరాజ్ కు 1994లో బీమా అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి అహద్ అనే కొడుకు కూడా జన్మించారు. పృధ్వి దంపతులకు ఈ అబ్బాయి ఒక్కగానొక్క బిడ్డ. ప్రస్తుతం ఆ బిడ్డ కూడా ఆటిజం విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు . వాడు ఎవరితోనూ కలవాలని అనుకోడు.. వాడి ప్రపంచంలో వాడే సంతోషంగా ఉంటాడు. ప్రస్తుతం వాడికి 27 సంవత్సరాలు. చాలా చక్కగా ఉన్నాడు.. అన్నీ అర్థం చేసుకుంటాడు కానీ మాట రాదు. బాబు విషయంలో నా భార్య చాలా స్క్రిక్ట్ గా ఉంటుంది. రూల్స్ పెడుతుంది నేను ఆ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను” అని తెలిపారు. అయితే కొడుకుకి వివాహం చేసే సమయంలో కూతురు వయసున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో అసలు నిజం ఏమిటంటే.. పృధ్వి రాజు తన మొదటి భార్యతోనే కలిసి ఉంటున్నారు.. అయితే 2వ పెళ్లి అనే విషయాన్ని ఎవరో కావాలని స్ప్రెడ్ చేస్తున్నట్లు సమాచారం.పళ్ళు ఉన్నవాడు ఏమైనా మాట్లాడుతాడు అసలు మీకేంటి సమస్య అంటూ.. ఆ అమ్మాయి కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version