జగన్ అడ్డాపై బాబు ఫోకస్..ఆ మూడే మెయిన్?   

-

గత ఎన్నికల తర్వాత ప్రతి జిల్లా జగన్ అడ్డాగానే మారిపోయాయి…అన్నీ జిల్లాల్లో జగన్ వేవ్ తో…టీడీపీ చిత్తు అయిపోయింది…అంటే ప్రతి జిల్లా జగన్ అడ్డాగానే మారాయి..అయితే ఇప్పుడు ఆ అడ్డాల్లో సీన్ మారుతుంది…ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు పుంజుకోవడం, పైగా జనసేన గాని టీడీపీతో కలిస్తే వైసీపీకి దెబ్బ పడిపోతుంది. ఈ పరిస్తితుల కారణంగా చాలా జిల్లాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వచ్చేసింది.

అయితే మిగతా జిల్లాల్లో పరిస్తితి ఎలా ఉన్న మాత్రం జగన్ సొంత అడ్డా కడపలో మాత్రం వైసీపీని టీడీపీ బీట్ చేయడం మాత్రం కష్టమే అని చెప్పొచ్చు..ఎలాంటి పరిస్తితుల్లోనైనా సరే…కడపలో టీడీపీ సత్తా చాటడం అనేది చాలా కష్టమైన పని…అసలు టీడీపీ వేవ్ ఉన్న 2014 ఎన్నికల్లోనే కడపలో టీడీపీ ఒక్క సీటే గెలుచుకోగా, వైసీపీ 9 సీట్లు గెలుచుకుంది…ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు…అన్నీ సీట్లు వైసీపీ వశమయ్యాయి.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా కడపలో వైసీపీ హవానే నడుస్తుందా? అంటే ఖచ్చితంగా నడుస్తుందనే చెప్పొచ్చు..కాకపోతే క్లీన్ స్వీప్ మాత్రం జరిగేలా కనిపించడం లేదు..కడపలో టీడీపీ కూడా రెండు, మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి…ఇక ఆ సీట్లపైనే చంద్రబాబు కూడా గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు. ఆ సీట్లని ఎలాగైనా గెలుచుకుని వైసీపీకి చెక్ పెట్టాలని బాబు ప్లాన్ చేస్తున్నారు..

అందుకే ఎక్కువ సార్లు కడప జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నారు…ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు కడపకు వచ్చారు..ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపకు వస్తున్నారు..ఇలా బాబు కడపపై ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అటు జిల్లాలోని టీడీపీ నేతలు కూడా దూకుడుగానే ఉంటున్నారు. ముఖ్యంగా మైదుకూరు, రాజంపేట, ప్రోద్దటూరు నేతలు ఎఫెక్టివ్ గా ఉన్నారు…ఈ మూడు సీట్లలోనే గెలిచి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. మరి చూడాలి కడపలో టీడీపీ ఏ మేర సత్తా చాటుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version