న్యూయార్క్‌పై కోవిడ్‌ పంజా.. హై అలర్ట్‌…

-

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో గత కొన్ని రోజుల కరోనా ధాటికి షాంఘై సిటీలో లాక్ డౌన్‌ విధించింది ప్రభుత్వం. అయితే.. ఇప్పుడు తాజా అమెరికాలోని ముఖ్య నగరమైన న్యూయార్క్‌ సిటీలో కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కొన్ని వారాల్లోనే ఇక్కడ కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం హైఅలర్డ్‌ను ప్రకటించింది. హై అల‌ర్ట్ జారీ చేయ‌డం అంటే మ‌న‌ల్ని మ‌నం జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని, మిత్రులు..బంధువులు, తోటి ఉద్యోగుల‌కు వైర‌స్ సంక్ర‌మించ‌కుండా చూసుకోవాల‌ని సిటీ హెల్త్ క‌మీష‌న‌ర్ డాక్ట‌ర్ అశ్విన్ వాస‌న్ తెలిపారు.

అల‌ర్ట్ జారీ చేసిన నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్క్ ధ‌రించాలి. ప‌బ్లిక్ ఇండోర్ సెట్టింగ్స్‌లో కానీ ఔట్‌డోర్ సెట్టింగ్స్‌లోనూ మాస్క్ అనివార్యం. కానీ ఇప్పుడు మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఆదేశాలు ఇవ్వ‌లేద‌ని న‌గ‌ర మేయ‌ర్ ఎరిక్ ఆడ‌మ్స్ తెలిపారు. ఏడు రోజుల స‌గ‌టు పాజిటివ్ రేటు 5.18 శాతానికి పెరిగిన‌ట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నుంచి అమెరికాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 10 ల‌క్ష‌ల మందికిపైగా మృతిచెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version