బాబు సొంతగడ్డలో ‘సైకిల్’కు మళ్ళీ పంకర్చే! 

-

చంద్రబాబు…1989 నుంచి కుప్పంలో పోటీ చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కుప్పం చంద్రబాబు సొంత గడ్డ కాదనే సంగతి అందరికీ తెలిసిందే…చంద్రబాబు సొంత వూరు నారావారిపల్లె ఉంది…చంద్రగిరి నియోజకవర్గంలో. అలాగే చంద్రబాబు రాజకీయ భవిష్యత్ మొదలైంది కూడా చంద్రగిరిలోనే. 1978లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రబాబు గెలిచారు..కానీ 1983లో చంద్రగిరిలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీపై ఓడిపోయారు.

ఇక తర్వాత బాబు టీడీపీలోకి వెళ్ళడం…ఎన్టీఆర్ కు అల్లుడు అవ్వడం, 1985లో పోటీకి దూరం ఉండటం…అలాగే 1989 నుంచి కుప్పం బరిలో నిలబడటం జరిగిపోయాయి. బాబు కుప్పం వెళ్ళిన దగ్గర నుంచి చంద్రగిరిలో టీడీపీ గెలిచిన దాఖలాలు పెద్దగా లేవు. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే చంద్రగిరిలో టీడీపీ గెలిచింది…ఈ మూడు ఎన్నికల్లో గెలవడానికి కారణం ఎన్టీఆర్ ఇమేజ్ మాత్రమే. ఎప్పుడైతే టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిందో అప్పటినుంచి చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు.

1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోలేని స్థితిలో బాబు ఉన్నారు. ఇక గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా నియోజకవర్గంపై చెవిరెడ్డి పట్టు సాధించారు…ఈయన పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటారు…అలాగే ప్రజలతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందుకే ఇక్కడ చెవిరెడ్డికి బలం ఎక్కువ.

ఇక వైసీపీలో పనితీరు బాగున్న ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ చెవిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం కష్టమే. పైగా ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నానికి పెద్దగా బలం లేదు. ఆయన కూడా నెక్స్ట్ గెలవడం కష్టమని తెలిసి…నియోజకవర్గం మారిపోవాలని చూస్తున్నారు. అంటే చంద్రబాబు సొంత గడ్డలో టీడీపీకి ఎలాంటి పరిస్తితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికైతే చంద్రగిరిలో మళ్ళీ సైకిల్ కు పంక్చర్ పడేలా ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version