ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు గురించి ఎప్పటినుంచో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఎదురుకోవాలంటే టీడీపీ-జనసేన కలవక తప్పదని మొదట నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుందనే విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది. అయితే ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి వచ్చింది.
ఒకవేళ వీరు మళ్ళీ సెపరేట్ గా పోటీ చేస్తే జగన్ సీఎం అవ్వడం ఖాయమే..కాబట్టి వీరిద్దరు కలవడానికే మొగ్గు చూపుతున్నారని ఇటీవల వారి మాటలని బట్టి అర్ధమవుతుంది. చంద్రబాబు గాని, పవన్ గాని… వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెబుతూనే.. పరోక్షంగా పొత్తు దిశగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. అసలు పవన్ అయితే పొత్తుల కోసం బీజేపీని కూడా ఒప్పిస్తానని అంటున్నారు. అంటే వీరి పొత్తు దాదాపు ఖాయమనే చెప్పాలి.
కాకపోతే ఇక్కడ బీజేపీతోనే తలనొప్పి…టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. కానీ టీడీపీ లేకుండా ముందుకెళితే విజయం కష్టమనే విషయం పవన్ కు అర్ధమవుతుంది..పైగా జగన్ ని మళ్ళీ గెలిపించినట్లు అవుతుంది..అందుకే పవన్ వైసీపీ వ్యతిరేకత ఓటుని చీలనివ్వను అని అంటున్నారు. ఒకవేళ పొత్తుకు బీజేపీ ఒప్పుకోకపోతే పవన్…బయటకొచ్చి మరీ టీడీపీతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు..వేరే నేతలు మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు గాని..ఉండవల్లి లాంటి మాట్లాడితే అందులో పెద్ద అర్ధమే ఉందని చెప్పాలి. అంటే ఉండవల్లి మాటల ప్రకారం…పవన్ అవసరమైతే బీజేపీని వదిలేసి టీడీపీతో కలిసే ఛాన్స్ ఉంది. ఇంకా ఎటు చూసిన బాబు-పవన్ పొత్తు ఖాయమని చెప్పొచ్చు. ఇక పొత్తు బట్టే జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది..పొత్తు ఉన్నా లేకపోయినా ఏం కాదనే ధీమాతో ఉంటే చిక్కులు తప్పవని చెప్పొచ్చు. మరి చూడాలి జగన్…బాబు-పవన్ కాంబోకు ధీటుగా వ్యూహాలు రెడీ చేస్తారేమో.