ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా జగన్ షాక్ అయ్యారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద అర్థమే ఉందని జగన్ కి తర్వాత అర్థమైంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ని ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి అవకాశం లేదు.
ఒకవేళ ఓటు వేస్తే కచ్చితంగా అనర్హులను చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టిడిపికి వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో వాళ్ల ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలి అనేది చంద్రబాబు ప్లాన్. వాళ్లు కచ్చితంగా జగన్ మాట దాటి ఓటు వేసే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళు ముగ్గురూ టిడిపికి ఓటు వేయకపోతే అనర్హులుగా ప్రకటించి అధికారం ఆ పార్టీకి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ముగ్గురు గనుక పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేస్తే తమ పదవులు కోల్పోతారు.
కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే టిడిపికి మూడు స్థానాలు వస్తాయా లేక వైసీపీనే కైవసం చేసుకుంటు౦దా అనేది చెప్పలేని పరిస్థితి . ఇప్పుడు ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ల గెలిచే అవకాశాలు లేవు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల చుట్టూ రాజకీయం తిరుగుతుంది అనే మాట మాత్రం వాస్తవం.