బీజేపీకి బిగ్ షాక్..టీఎంసీలోకి కీల‌క‌ నేత‌..!

-

బీజేపీకి బిగ్ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతున్నా అని ప్ర‌క‌టించిన బీజేపీ నాయ‌కుడు బ‌బుల్ సుప్రియో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ‌బుల్ బీజేపీ లో నుండి బ‌యట‌కు వ‌చ్చి నెల రోజులు అవుతుంది. బీజేపీకి గుడ్ బై చెప్పిన బ‌బుల్ తాను ఇక‌పై రాజ‌కీయాల్లో ఉండ‌న‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే బీజేపీకి షాక్ ఇస్తూ ఇప్పుడు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

తాను తృణ‌మూల్ కాంగ్రెస్ లో చేరిన‌ట్టు శ‌నివారం బ‌బుల్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. జులై 31న బబుల్ బీజ‌పీ కి రాజీనామా చేశారు అంతే కాకుండా త‌న ఎంపీ ప‌ద‌వికి కూడా ఆయ‌న రాజీనామా చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా బ‌బుల్ సుప్రియో ప్లే బ్యాక్ సింగర్ గా న‌టుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి బీజేపీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version